Social Icons

Pages

Sunday 10 February 2013

జ్యోతిగారికి ధాంక్స్....

 వారంలోని అన్ని రోజులకంటే శనివారాలు నాకు చాలా ఇష్టం. సోమవారం నుండి శుక్రవారం వరకు పేషంట్లతో, ఆపరేషన్లతో   బిజీ బిజీగా ఉంటాను.  శనివారం మాత్రం నాకోసమే అట్టి పెట్టుకున్నా. ఆ రోజు నా బాస్ (భార్యామణి) కూడా పని చేస్తుంది. ఆదివారం మొత్తం ఆమె కోసమే ధారాదత్తం  చేశా. నా లైఫ్ ని చాలా క్లారిటీ తో ప్లాన్ చేసేసాను. అఫ్కోర్స్ ఆదివారాలు కూడా మా ఆవిడని మాయ చేసి నాకు నచ్చిన పనులే చేస్తుంటా అనుకోండి... అది వేరే సంగతి..

ఈ శనివారం అంటే నిన్న ఓ స్పెషల్ అతిథి మా ఇంటికి వచ్చారు. జ్యోతిగారు, వాళ్ళబ్బాయి చైతన్య. ఎందుకంటారా? వైద్యానికి కాదండి బాబు. పాఠాలు చెప్పడానికి. ఎంతో  శ్రమ తీసుకుని మా ఇంటికి వచ్చి మరీ బ్లాగ్వద్గీత బోధించారు. నా మట్టిబుర్ర కొంత వికసించింది. వాళ్ళబ్బాయి కూడా కొన్ని టెక్నికల్ విషయాలు నేర్పించాడు.

ఏదో ఒక రోజు నేను కూడా జ్యోతిగారిలా, చందు శైలజలా, రమణలా  (అదేనండి మీకు తెలిసిన పనిలేక బ్లాగర్)  గొప్ప బ్లాగ్ బస్టర్  అయిపోవాలని నాకు నేనే ఆశీర్వదించుకుంటూ ................ స్వస్తి ...

మీ గురవారెడ్డి.






9 comments:

  1. శైలజ గారి ద్వారా మీ బ్లాగ్ బస్టర్ ట్రయిలర్ చూసే మహాభాగ్యం కలిగింది. ఫుల్ మూవి చూపించేసి మమ్మల్ని తరింపజేయండిక :)
    చాలారోజుల క్రితమే బ్లాగు మొదలుపెట్టినట్టున్నారు... belated welcome to blogs sir :)

    ReplyDelete
  2. స్వాగతం దొరా సుస్వాగతం

    ReplyDelete
  3. గుంటూరు నీళ్ళల్లో creativity, humor,satire,humbleness,staying-closer-to-the-roots, down to the earth, great conversational skills, ఇవన్నీ కలిపి ఉన్నాయా గురవారెడ్డి గారూ? శైలజ గారూ, రమణ గారూ, మీరూ, మా వేణూ..
    Very nice to know all of you amazing people!

    Welcome to the blog world. Hopefully this will be a good outlet for you, and we will get to read nice posts!

    ReplyDelete
  4. మీకేంటి చెప్పండి.వజ్రం కాకుంటే కొంచెం మెరుగులు కావాలి.
    మా శైలజ చందు గారు కాకుండా మాకు ఇంకో మంచి రచయిత కం డాట్రు బాబు
    వచ్చేసారు...వెల్కం :))

    ReplyDelete
  5. మహద్భాగ్యం... బ్లాగ్ లోకానికి సుస్వాగతం సార్.
    చక్కని కబుర్లు మొదలెట్టేయండి మరి.. ఆసక్తిగా చదివేయడానికి మేమంతా సిద్దం.

    ReplyDelete
  6. Welcome to the Blog world అండి !
    మీ బ్లాగు 3 పోస్ట్లు , ఆరు వందల కామెంట్లు గా కళకళలాడిపోవాలి పోవాలి అనికోరుకుంటున్నా !
    కుమార్ జీ ఆ పై లిస్టు లో నా పెరుందుకు లేదు అని నా ప్రశ్న. తప్పదు ఇక మీతో యుద్దమే :-)

    ReplyDelete
  7. చందు శైలజగారికి మీరు పంపిన బహుమతి చూసాక ఆసక్తి మొదలయ్యి మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చూసాను. ఆసక్తి తారాస్థాయికి చేరి మీ గురవాయణం చదవటం మొదలెట్టాను. వైద్యాన్ని వ్యాపారం చేసేస్తున్న ఈ రోజుల్లో మీలాంటి వారు ఉండటం ఒక అద్భుతం.

    మీరూ, వరప్రసాద్ రెడ్డి గారు ఇలా మంచోళ్ళంతా ఒక దగ్గర చేరి మీలో మీరే ఆ మంచితనం పంచేసుకోకపోతే కాస్త మాక్కూడా పంచండీ బాబ్బాబూ మీకు పుణ్యముంటుంది.

    ReplyDelete
  8. "కుమార్ జీ ఆ పై లిస్టు లో నా పెరుందుకు లేదు అని నా ప్రశ్న"
    హ హ శ్రావ్యా! నువ్వన్నాక మళ్ళీ పైకెళ్ళి ఓసారి చూసి ఆలోచిస్తున్నా.
    ఉమ్.. మ్...మ్...

    వద్దులే, మనం వేరే పేర్లతో ఇంకో గ్రూప్ పెట్టుకుందాం లే ;P
    (నేనుజంప్)
    (Sorry for misusing this space guravareddy garu.)

    ReplyDelete
  9. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం :)

    ReplyDelete