Social Icons

Pages

Wednesday, 13 March 2013

కొంచెం సరదాగా ... కొంచెం సీరియస్ గా...
సీరియస్సుగా అన్నానని ఖంగారు పడకండి.. నేను సరదాగానే ఉంటాను కాని ఇవాళ తరంగ రేడియోలో కాస్త సీరియస్ విషయం  మీద మాట్లాడదామనుకుంటున్నాను. ఈ మధ్య జరిగిని డిల్లీ దారుణం, ఎంత ఆందోళన జరిగినా తగ్గని మహిళలపై అత్యాచారాలు,  మనమందరం ఘనంగా జరుపుకున్న మహిళా దినోత్సవ సంధర్భంగా  మహిళలకు సంబంధించిన సమస్యలు, మరికొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావిద్దామని ఆలోచన వచ్చింది. అందుకని నాతోపాటు మాట్లాడటానికి ప్రముఖ రచయిత్రి డా.మృణాలిని, సూపర్ బ్లాగర్ జ్యోతి వలబోజుగారిని ఆహ్వానించాను. వాళ్లు వస్తామన్నారు.. ఇంకేం మరి ఈ రోజు రాత్రి 8.30 గంటలనుండి 10.30 గంటల వరకు తరంగ రేడియో ఆన్ చేసుకోండి. మా మాటలు వింటూ మీరు కూడా కాల్ చేసి మాట్లాడొచ్చు మరి.. మరి రాత్రి మీ పనులు త్వరగా పూర్తి చేసుకుని తీరిగ్గా వింటారు కదా..తరంగ రేడియో ప్లేయర్ లింక్..

http://tharangamedia.net/TharangaPlayer/index.php?sname=teluguliveఇక మీరు కాల్ చేయవలసిన నంబర్లు , మెయిల్ ఐడి, స్కైప్ ఐడి..
U.S.A  - (201) 340 - 1950  ..... (201) 345 - 4939


India  -  (040) 667 - 78403

Email: telugu@tharangamedia.com

Skype ID :  telugu.tharanga సరే మరి రాత్రి కలుద్దాం.. మరో మాట.. మహిళా  దినోత్సవం సందర్భంగా మా సన్ షైన్ హాస్పిటల్స్ తరపున ఒక బహుమతి.  మీ అమ్మకు కాని, అక్కకు కాని, చెల్లెలికి కాని, స్నేహితురాలికి కాని ఈ బహుమతి ఇవ్వండి. అమ్మాయిలూ(అమ్మలూ) మీకు మీరు ఈ బహుమతి ఇచ్చుకోండి..


Tuesday, 12 March 2013

డా.గురవారెడ్డితో కబుర్లు .. అంటే నాతోనేనండోయ్..

ఎప్పుడూ సూదులు, మందులు, కత్తులు, కటార్లతో విసుగెత్తి , ఆన్లైన్ రేడియో తరంగ వాళ్లతో అఫ్పుడప్పుడు అంటే నాకు తీరిక దొరికినప్పుడు కబుర్లు చెప్తుంటాను. మీరెప్పుడైనా విన్నారా?? రేపు రాత్రి ఒక స్పెషల్ షో చేయబోతున్నాను. మీకందరికి అది తప్పకుండా నచ్చుతుందని నా నమ్మకం. పూర్తి వివరాలు మళ్లీ చెప్తాను. అంతవరకు నేను ఇంతవరకు చెప్పిన కబుర్లన్నీ ఇక్కడ వినండి. ఓ పనైపోతుంది...


గురవారెడ్డితో కబుర్లు..